మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:39 IST)

ఒప్పో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు జియో ఉచిత బంపర్ ఆఫర్... ఏంటది?

ఒప్పో సంస్థ తయారు చేసే స్మార్ట్ ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో ఉచిత బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒప్పో - జియో సంస్థల మధ్య కుదిరిన ఒక అవగాహనా ఒప్పందంలో భాగంగా, ఈ ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది.

ఒప్పో సంస్థ తయారు చేసే స్మార్ట్ ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో ఉచిత బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒప్పో - జియో సంస్థల మధ్య కుదిరిన ఒక అవగాహనా ఒప్పందంలో భాగంగా, ఈ ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా, ఒప్పో స్మార్ట్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు ఉచితంగా హై స్పీడ్ 4జీ డేటాను అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. 
 
ఒప్పోకు చెందిన ఎఫ్3, ఎఫ్3 ప్లస్ లేదా ఎఫ్1 ప్లస్ ఫోన్లను వాడుతున్న వారు రూ.309తో జియో సిమ్ రీచార్జ్ చేసుకుంటే దాంతో 10 జీబీ ఉచిత 4జీ డేటా లభిస్తుంది. ఇలా మార్చి 31, 2018 వరకు ఈ ఆఫర్‌ను యూజర్లు 6 సార్లు వాడుకుని మొత్తం 60 జీబీ డేటాను పొందవచ్చు. 
 
అలాగే, ఒప్పోకు చెందిన ఎఫ్1ఎస్, ఎ57, ఎ37, ఎ33 ఫోన్లను వాడుతున్న వారికి 7 జీబీ ఎక్స్ ట్రా డేటా ఫ్రీగా లభించనుంది. వీరు కూడా పైన చెప్పిన తేదీ లోపు 6 సార్లు రీచార్జి చేసుకుని మొత్తం 42 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చన్నమాట. అయితే ఈ ఆఫర్ జూన్ 30, 2017వ తేదీ తర్వాత ఒప్పో ఫోన్లను కొన్నవారికే వర్తిస్తుందనే నిబంధన విధించింది.