మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (12:30 IST)

4జీ వోల్ట్ సేవలో బీఎస్ఎన్ఎల్: రంగంలోకి ప్రైవేట్ సంస్థలు

ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సంస్థ 4జీ వోల్ట్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీ నిచ్చే దిశగా కొత్త ఆఫర్లు ప్రకటించనుంది. ఇంటర్న

ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీగా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సంస్థ 4జీ వోల్ట్ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీ నిచ్చే దిశగా కొత్త ఆఫర్లు ప్రకటించనుంది. ఇంటర్నెట్ సేవల కోసం 700 మెగావాట్ బ్యాండ్ ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 
 
అలాగే బ్రాడ్‌బ్యాండ్ నాణ్యతను పెంచేందుకు, సైబర్ భద్రతను పెంపొందింపజేసేందుకు బీఎస్ఎన్ఎల్ రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే 2017-18 ఆర్థిక  సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ 4జీ వోల్ట్‌ సేవలను ప్రారంభిస్తామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలను బరిలోకి దించనున్నామని, ఈ క్రమంలో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఇన్ఫకామ్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ తెలిపారు. ఈ ఆఫర్ కింద కొత్త వినియోగదారులకు, ఎంఎన్‌పీ ద్వారా సంస్థ నెట్‌వర్క్‌కు మారిన వారికి 350ఎంబీ ఉచిత డేటా ఇవ్వనున్నారు. ఈ డాటాను మొదటి 30 రోజులలోపు మాత్రమే వాడుకోవాలని అనంతరామ్ చెప్పారు.