శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:28 IST)

గుండుతో నటిస్తా.. ధోనీ హీరోయిన్ దిశాపటానీ..

బాలీవుడ్ హీరోయిన్లు లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేస్తున్నారు. ఇందుకోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో దిశాపటానీ కూడా చేరింది. త్వరలో గుండుతో ఉన్న పాత్ర చేయడానికి తాను సిద్ధంగా ఉన్

బాలీవుడ్ హీరోయిన్లు లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేస్తున్నారు. ఇందుకోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా వీరి జాబితాలో దిశాపటానీ కూడా చేరింది. త్వరలో గుండుతో ఉన్న పాత్ర చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. ఆ ప్రకటన చేశాక తన స్నేహితులందరినీ ఆ క్యారెక్టర్‌ చేస్తే ఎలా ఉంటుందని అభిప్రాయం అడుగుతుందట. కానీ ప్రయోగాలు చేస్తేనే అవకాశాలు కూడా పెరుగుతాయని గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపింది.
 
ఒకవేళ కేన్సర్‌ బాధితురాలు తరహా పాత్రలో దిశా పటానీ నటిస్తుందా అనే దానిపై చర్చ సాగుతోంది. దిశా పటానీ.. ధోనీ, కుంగ్ ఫూ యోగా వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది చేతినిండా సినిమాలు వివిధ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న తరుణంలో దిశా మాత్రం నటనకు ప్రాధాన్యత గల రోల్స్ చేయాలని నిశ్చయించుకుంది.