మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (17:11 IST)

జియో ఫోన్ ప్లీజ్... బుక్ చేసుకున్న 40,00,000 మంది... మీ ఫోన్ ఇలా రెడీ...

టెలికాం రంగంలోనే సంచలనం సృష్టించిన ముందుకు దూసుకుపోతే మిగిలిన వారిని లేవలేని స్థితిలో తోసేసిన జియో వినియోగదారుల కోసం జియో ఫోన్ రెడీ అవుతోంది. కేవలం 1500 రూపాయలకే అన్ని ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్‌ను అందించ

టెలికాం రంగంలోనే సంచలనం సృష్టించిన ముందుకు దూసుకుపోతే మిగిలిన వారిని లేవలేని స్థితిలో తోసేసిన జియో వినియోగదారుల కోసం జియో ఫోన్ రెడీ అవుతోంది. కేవలం 1500 రూపాయలకే అన్ని ఫీచర్లతో ఉన్న ఈ ఫోన్‌ను అందించడమే కాకుండా ఆ మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్ధమైన జియో కంపెనీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జియో ఫోన్ బుక్ చేసుకున్న యూజర్లకు ఫోన్లను అందించేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తోంది.  అనుకున్న సమయంలోగా వినియోగదారులకు జియో ఫోన్‌ను అందించేందుకు ప్రయత్నిస్తోంది. 
 
ఆగస్టు 24నే కంపెనీ ఈ ఫోన్‌ బుకింగ్స్‌ను చేపట్టింది. అనుకున్న దాని కంటే ఎక్కువ బుకింగ్ ఫోన్ల ద్వారా జియోకు వచ్చింది. ముందుగా 3 మిలియన్లు అనుకున్నారు.. కానీ అది కాస్తా 4 మిలియన్లను దాటేసింది. ఆ నాలుగు మిలియన్ల ఫోన్లను కస్టమర్లకు ఇవ్వాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పనే. ఈ నేపధ్యంలో కొద్దిగా ఆలస్యం కావచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఐతే ఫోన్ బుక్ చేసుకున్నవారు తమ ఫోన్ స్టేటస్ తెలుసుకునేందుకు మై జియో యాప్, మేనేజ్ వోచర్స్ లోకి వెళ్లి చూస్తే స్టేటస్ కనిపిస్తుంది. ఇదిగో ఈ క్రింది ఫోటోలో వున్నట్లు...