1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:33 IST)

డెలివరీకి సిద్ధమైన జియో ఫోన్లు... అన్ బాక్సింగ్ వీడియో ఇదే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న 4జీ ఫీచర్ ఫోన్ పంపణీ త్వరలో ప్రారంభంకానుంది. గత నెల 24వ తేదీన ఫోన్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం కాగా, తొలి విడ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న 4జీ ఫీచర్ ఫోన్ పంపణీ త్వరలో ప్రారంభంకానుంది. గత నెల 24వ తేదీన ఫోన్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం కాగా, తొలి విడత ఫోన్లు మరో రెండు మూడు రోజుల్లో డెలివరీ కానున్నాయి. 
 
అయితే, ఈ ఫోన్‌ను ప్యాక్ చేసిన బాక్సింగ్‌లో ఉన్న వస్తువులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్‌తో పాటు ఎలాంటి విడిభాగాలు ఉన్నాయి? బ్యాటరీ సామర్థ్యం, దాన్ని ఫిక్స్ చేసుకోవడం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. ఫోన్‌ను ఆన్ చేస్తే మై జియో, జియో టీవీ, జియో మ్యాజిక్, కాల్‌లాగ్ వంటి యాప్స్ కనిపిస్తున్నాయి. 
 
జియో స్టోర్ పేరిట ప్రత్యేక ప్లే స్టోర్ కూడా ఇందులో ఉంది. కెమెరా, వీడియో ప్లేయర్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ వర్షన్ కైఓస్ 2.0 ఆధారంగా పని చేసే ఫోన్ మోడల్ నంబర్ ఎల్‌వైఎఫ్ 2403 అని కనిపిస్తోంది. ఆ వీడియోనూ మీరూ ఓసారి చూడండి.