సంబంధిత వార్తలు
- ఆర్మీకి హనీట్రాప్ వార్నింగ్: అందమైన అమ్మాయిలతో జాగ్రత్త.. బుట్టలో పడ్డారో.. సీక్రెట్‌గా వీడియోలు తీసి?
- భర్తతో వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉరేసుకున్న మోడల్ రిసిలా
- బ్లూవేల్ ఆన్ లైన్ గేమ్ ఆడుతూ.. నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు..
- ఫేస్‌బుక్‌ను నిషేధించే దిశగా పాకిస్థాన్: 2018నాటికి ఆ పనిచేసేస్తుందా?
- రిలయన్స్ జియో కొత్త ఫోనులో వాట్సప్ ఉండదట.. షాకైన కస్టమర్లు..
జియో యూజర్లకు గుడ్‌న్యూస్... 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్!
రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొనుగోలుదార్లకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. ఈ సంస్థ విడుదల చేయనున్న 4జీ ఫీచర్ ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కోసం ప్రత్యేక యాప్‌ను అ
రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొనుగోలుదార్లకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. ఈ సంస్థ విడుదల చేయనున్న 4జీ ఫీచర్ ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకుని రానుందనే వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈనెలాఖరులో జియో 4జీ ప్రీ బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ నెలలో యూజర్లకు ఈ ఫోన్లు లభించనున్నాయి. అయితే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో ఫేస్‌బుక్, యూట్యూబ్ తప్ప మిగిలిన సోషల్ యాప్స్ ఏవీ పనిచేయవనే ప్రచారం ఉంది. వాట్సాప్ ఈ ఫోన్‌లో రాదని జియో వర్గాలు స్పష్టత ఇచ్చాయి కూడా.
అయితే దీనిపై చాలా మంది యూజర్లు పెదవి విరిచారు. జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్ రాదనే విషయం తెలిశాక చాలా మంది ఈ ఫోన్‌ను కొనేందుకు నిరాసక్తతను ప్రదర్శించినట్టు తెలిసింది. దీంతో జియో వాట్సాప్‌ను ఎలాగైనా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగానే ప్రస్తుతం జియో ప్రతినిధులు వాట్సాప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ వెర్షన్‌ను క్రియేట్ చేసేందుకుగాను జియో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రెండు కంపెనీల ప్రతినిధులు ఈ విషయంపై చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ చర్చలు ఫలిస్తే ఈ ఫోన్‌లో వాట్సాప్ సౌకర్యాన్ని అందుబాటులోకి రానుంది.
తర్వాతి కథనం
