గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (12:29 IST)

ఆర్మీకి హనీట్రాప్ వార్నింగ్: అందమైన అమ్మాయిలతో జాగ్రత్త.. బుట్టలో పడ్డారో.. సీక్రెట్‌గా వీడియోలు తీసి?

భారత్‌లోని త్రివిధ దళ అధికారులు అందమైన అమ్మాయిలతో జాగ్రత్తగా వుండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఆర్మీ స్థావరాలు, ఆయుధాల వివరాలు, సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు, లేదా సైన్యాన్ని చ

భారత్‌లోని త్రివిధ దళ అధికారులు అందమైన అమ్మాయిలతో జాగ్రత్తగా వుండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఆర్మీ స్థావరాలు, ఆయుధాల వివరాలు, సైన్యం రహస్యాలు తెలుసుకునేందుకు, లేదా సైన్యాన్ని చేరుకునేందుకు ఈ రకమైన హనీ ట్రాప్ విసురుతారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పాక్, చైనాలు కుట్రచేశాయని నిఘా వర్గాలు తెలిపాయి.  
 
ఇందులో భాగంగా లాహోర్ వేదికగా భారత ఆర్మీ అధికారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ - చైనా యువతులు అనర్గళంగా హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడుతూ విసురుతారని హెచ్చరికలు జారీ చేశారు. చైనా, పాకిస్థాన్ అమ్మాయిలు సోషల్ మీడియా ఆధారంగా హనీ ట్రాప్ విసిరేందుకు రెడీగా వున్నారని చెప్పుకొచ్చారు. 
 
పరిచయం పెంచుకుందామని సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతారని.. వారి వలలో చిక్కుకుంటే ఇక అంతే సంగతులని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సామాజిక మాధ్యమాల ఆధారంగా వారు హనీ ట్రాప్ విసిరేందుకు సిధ్ధంగా ఉన్నారని తెలిపాయి. పరిచయం పెంచుకుందామని లైన్లో పడేస్తారని.. వారి బుట్టలో పడితే అంతే సంగతులని చెప్పారు. సీక్రెట్ వీడియోలు తీసి వాటిని నెట్లో పెడతామని బెదిరిస్తారని నిఘా వర్గాలు హెచ్చరించాయి.