మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (11:05 IST)

జియో ఫీచర్ ఫోన్.. వాడే చిప్ సెట్ లీక్... డిజిటల్ పేమెంట్‌ ఇక ఈజీ..

ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా ఫీచర్ ఫోన్లను వినియోగదారులకు అందించనుంది. అయితే ఈ ఫోన్లు ఏ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ తాజాగా జియో వాడే చి

ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా ఫీచర్ ఫోన్లను వినియోగదారులకు అందించనుంది. అయితే ఈ ఫోన్లు ఏ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ తాజాగా జియో వాడే చిప్‌ సెట్ సంగతి బయటికి వచ్చేసింది. ఈ చిప్‌లను తయారు చేస్తున్న కంపెనీలు ఆ విషయాన్నివెల్లడించాయి. జియో వీవోఎల్టీఈ ఫీచర్ ఫోన్ (జియోఫోన్)లో క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్ 205, స్నాప్‌డ్రాగన్ ఎల్‌టీఈ ఎస్ఓసీ ప్లాట్‌ఫ్లామ్‌కు చెందిన ఎస్‌సీ9820 ప్రాసెసర్లను ఉపయోగించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాయి. 
 
అలాగే జియో స్మార్ట్‌ఫోన్ 22 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ ఫోన్ ద్వారా పూర్తి భద్రతతో కూడిన డిజిటల్ పేమెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది  ప్రపంచంలోనే అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అని జియో పేర్కొంది. ఇందులో జియో సినిమా, జియో టీవీ, జియో మ్యూజిక్ వంటి జియో యాప్స్ వంటివి ప్రీలోడెడ్‌గా వస్తాయి.
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, జియో ఫీచర్‌ ఫోన్‌ను అద్భుతమైన ఫీచర్లతో లాంచ్‌ చేసేశారు. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్‌ టెస్టింగ్‌కు రానుంది. ఆగస్టు 24 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమై, సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చేస్తోంది. ఈ ఫోన్‌ కొనుగోలుచేయాలనుకునేవారు, వన్‌-టైమ్‌ సెక్యురిటీ డిపాజిట్‌ కింద రూ.1500 కట్టి, ఈ ఫోన్‌ను పొందవచ్చు. మూడేళ్ల తర్వాత ఆ రూ.1500ను జియో రిటర్న్‌ చేయనుందని అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.