బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (14:15 IST)

ఒకరు కారు ఇద్దరు కాదు.. ఏకంగా 90 మందిని చంపాడు..?!

బెర్లిన్‌కు చెందిన ఓ మేల్ నర్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 90 మందిని హతమార్చాడు. ఇద్దరు రోగులను మోతాదుకు మించి ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించే నీల్స్ హోజెల్ (40

బెర్లిన్‌కు చెందిన ఓ మేల్ నర్స్ ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 90 మందిని హతమార్చాడు. ఇద్దరు రోగులను మోతాదుకు మించి ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన కేసులో జైలుశిక్ష అనుభవించే నీల్స్ హోజెల్ (40) అనే మేల్ నర్స్ ఏకంగా 90 మందిని చంపేశాడనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.

రోగులకు చంపేందుకు ఏమాత్రం వెనుకాడని.. నీల్స్ ఐసీయూలో వున్న పేషెంట్లకు మోతాదుకు మించి మందులిచ్చేవాడు. తీవ్రమైన గుండెపోటుతో మరణించేలా నీల్స్ మందు ఇచ్చేవాడు. ఆపై మరణయాతన పడుతున్న వారిని కాపాడే ప్రయత్నం చేసేవాడు. 
 
అతడి ప్రయత్నం ఫలించి రోగులు ప్రాణాలతో బయటపడితే.. తానేదో గొప్ప  పనిచేసినట్లు ఫీలై ఫోజులు కొట్టేవాడు. కానీ రోగులు చనిపోతే మాత్రం కుంగిపోయేవాడు. ఇలా 90 మందిని నీల్స్ పొట్టనబెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా 130 మృతదేహాల అవశేషాలను వెలికి తీసి రసాయన పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు చెప్పారు.

2008లో ఇద్దరు పేషెంట్లను హతమార్చిన కారణంగా అతనికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. 2015లో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా 90 మందిని అతడు హత్య చేసినట్లు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పరిశోధనల్లో ఆ విషయమని తేలితే అతనికి జీవితఖైదు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.