1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. India v Australia live updates: Australia set India 243 to win

నాగ్‌పూర్ వన్డే : భారత్ విజయలక్ష్యం 243 రన్స్

ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ముంగిట ఆస్ట్రేలియా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున

India
ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ముంగిట ఆస్ట్రేలియా 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేశారు. 
 
కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో 3-1 తేడాతో ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. నాల్గో వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పొందిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో కనుక భారత జట్టు విజయం సాధిస్తే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంటుంది. అలాగే, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించాలన్న కృతనిశ్చయంతో ఆస్ట్రేలియా ఉంది. 
 
అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడారు. ఫలితంగా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కుర్రోళ్లు డేవిడ్ వార్నర్ (53), ఫించ్ (32), స్మిత్ (16), హ్యాండ్స్ కాంబ్ (13), టీఎం హెడ్ (42), స్టాయినిస్ (46), ఎంఎస్ వేడ్ (20), జేపీ ఫాల్కనర్ (12), కూల్టర్-నీల్ డకౌట్ (0), కమిన్స్ నాటౌట్ చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, బుమ్రా 2, పాండ్యా 1, కేఎం జాదవ్ 1, అక్షర్ పటేల్ 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దశాబ్దన్నర కాలంగా అజిత్ అగార్కర్ రికార్డు పదిలం... ఏంటది?