శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:28 IST)

వారిని చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోంది : సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక పర్యటనతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారంట

భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక పర్యటనతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారంటూ కొనియాడారు. 
 
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 5-0తోనూ, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ప్రపంచంలో అత్యుత్తుమ టాప్ ఆర్డర్ భార‌త జ‌ట్టు సొంతం అని సునీల్‌ కొనియాడారు.
 
ముఖ్యంగా శిఖర్ ధవన్‌ - రోహిత్ శర్మ‌, రహానే - రోహిత్‌ శర్మల ఓపెనింగ్‌ జోడీతో పాటు, వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీపైనా ఆయ‌న పొగ‌డ్త‌ల‌ జల్లు కురిపించారు. ఈ టాప్‌-3 బ్యాట్స్‌మెన్లను చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోందన్నారు. ఈ ముగ్గురూ చాలా సార్లు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశార‌ని, దీంతో వారి త‌ర్వాత నాలుగో స్థానంలో వచ్చే వారికి 30 నుంచి 40 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌ దక్కుతోంద‌ని గ‌వాస్క‌ర్‌ అన్నారు.
 
నాగ్‌పూర్‌లో జ‌రిగిన వన్డేలో కోహ్లీ 55 బంతుల్లో 39 పరుగులు చేయడంపై స్పందిస్తూ, నాగ్‌పూర్‌లాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేయ‌డం అంత సులభమేం కాద‌ని, అది ఇండోర్‌ లేదా బెంగళూరు పిచ్‌ల మాదిరిగా ఉండ‌క‌పోవ‌డంతో కోహ్లీ కొంత ఇబ్బంది పడ్డాడన్నారు. మొత్తంమీద శ్రీలంకతోపాటు స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లలో భారత క్రికెటర్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉందన్నారు.