మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

భారత్‌పై విశ్వాసం కోల్పోయిన కాశ్మీరీలు.. యశ్వంత్ సిన్హా

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్నటికినిన్న ప్రధాని మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనా

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. నిన్నటికినిన్న ప్రధాని మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉందంటూ సంచలన విమర్శలు చేశారు. 
 
ఇపుడు జమ్మూకాశ్మీరు సంక్షోభంపై కేంద్రం తీరును తప్పుబట్టారు. భావోద్వేగపరంగా కాశ్మీరీలను భారత్‌ కోల్పోయిందన్నారు. వారు భారత్‌పై విశ్వాసం కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్‌ థాపర్‌ ‘ది వైర్‌’ చానల్‌ కోసం యశ్వంత్‌తో ముఖాముఖి మాట్లాడారు.
 
కన్సర్న్‌డ్‌ సిటిజెన్స్‌ గ్రూప్‌ (సీసీజీ)నకు యశ్వంత్ సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. ఈ గ్రూపు కొంతకాలం కింద కాశ్మీరు వెళ్లి వివిధ వర్గాల ప్రజలు, వేర్పాటువాదులతో చర్చించింది. అపుడు ఎదురైన అనుభవాలను ఆయన ఇపుడు బహిర్గతం చేశారు. 
 
‘కాశ్మీరీలు భారత్‌కు దూరం కావడం నాకు ఆందోళన కలుగజేస్తోంది. మనం అక్కడకు వెళ్లి చూస్తే మనపై వారికి విశ్వాసం పోయిందని తెలుస్తుంది. దీనిపై చర్చించేందుకు ప్రధానిని అపాయింట్‌మెంట్‌ కోరాను. పదినెలలు గడిచినా ఆయన ఇంతవరకు స్పందించలేదు’ అని వాపోయారు.