శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (11:15 IST)

డేరా బాబా భర్త కాదు... తండ్రి... చాలా అమాయకుడు : హనీప్రీత్

డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకుంటున్న హనీప్రీత్ ఇన్సాఫ్ ఎట్టకేలకు మీడియా కంటికి చిక్కింది. తాను డేరా బాబాకు భార్యను కాదనీ, ఆయన తన తండ్రి అని స్పష్టంచేసింది. తమ ఇద్దరి మధ్య తల్లీకూతుళ్ళ అనుంబంధమే కానీ

డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకుంటున్న హనీప్రీత్ ఇన్సాఫ్ ఎట్టకేలకు మీడియా కంటికి చిక్కింది. తాను డేరా బాబాకు భార్యను కాదనీ, ఆయన తన తండ్రి అని స్పష్టంచేసింది. తమ ఇద్దరి మధ్య తల్లీకూతుళ్ళ అనుంబంధమే కానీ, భార్యాభర్తల బంధం లేదనీ తేల్చి చెప్పింది.
 
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరా బాబాకు 20 యేళ్ళ జైలుశిక్ష పడిన విషయం తెల్సిందే. కోర్టు తీర్పు అనంతరం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లకు హనీప్రీత్ ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇపుడు అంటే 36 రోజుల తర్వాత ఆమె మీడియా కంటికి చిక్కింది. 
 
ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏం చెప్పదల్చుకున్నావని మీడియా ప్రతినిధి అడగ్గా... 'మీడియాలో హనీప్రీత్ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ సంఘటన తర్వాత హనీప్రీత్ భయపడి పారిపోయినట్టు మీడియా చూపిస్తోంది. ప్రస్తుతం నా మానసిక పరిస్థితిపై కనీసం మాట్లాడలేకపోతున్నా. నన్ను దేశద్రోహి అంటూ పిలవడం పూర్తిగా తప్పు. అనుమతి లేకుండా తండ్రితో పాటు కూతురు కోర్టుకు వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు...' అని హనీప్రీత్ చెప్పుకొచ్చింది. 
 
పంచకుల అల్లర్లకు మీరే ప్రధాన సూత్రధారి అని అంటున్నారు కదా? అని అడగ్గా.... 'నేను ఒక్కటే అడగదల్చుకున్నా... అంతమంది పోలీసులు ఉండగా ఓ అమ్మాయి అనుమతి లేకుండా ఎలా ఒంటరిగా వెళుతుంది? ఆ తర్వాత నేను తప్పు చేశానంటూ వాళ్లంతా అంటున్నారు. అల్లర్లలో నా హస్తం ఉందని లేనిపోని నిందలు వేస్తున్నారు.. కాని నాపై వాళ్ల దగ్గర ఏమైనా ఆధారం ఉందా?' అంటూ ప్రశ్నింది.