శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (16:47 IST)

హనీప్రీత్ సింగ్ లొంగిపోయిందా? ఐడియా ఇచ్చింది ఎవరు?

డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా వున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ దోషిగా తేలిన ఆగస్టు 25న పం

డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా వున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ దోషిగా తేలిన ఆగస్టు 25న పంచకులలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. దాదాపు 40మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అల్లర్లలో హనీప్రీత్ సింగ్ ప్రధాన నిందితురాలిగా వుంది. 
 
హనీప్రీత్‌ను మోస్ట్ వాంటెడ్ నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు.. ఆమెను అరెస్టు చేసేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మంగళవారం తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. పోలీసుల ముందు లొంగిపోవడమే మంచిదంటూ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా సన్నిహితురాలు హనీప్రీత్ సింగ్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పంజాబ్- హర్యానా కోర్టులో లొంగినట్లు సమాచారం. ఇప్పటికే హనీప్రీత్ సింగ్‌ను కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా తాను సూచించినట్టు హనీప్రీత్ లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య తెలిపారు.