శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:18 IST)

నూనెను పీల్చడానికి న్యూస్ పేపర్లు వాడొద్దు... వాటిని వాడండి..

గారెలు, బూరెలు, పూరీలు వంటి నూనె వంటకాలను నూనె పీల్చడానికి న్యూస్ పేపర్లపై వేయడం మంచిది కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ.. నూనెను పీల్చడానికి కోసం

గారెలు, బూరెలు, పూరీలు వంటి నూనె వంటకాలను నూనె పీల్చడానికి న్యూస్ పేపర్లపై వేయడం మంచిది కాదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ.. నూనెను పీల్చడానికి కోసం.. న్యూస్ పేపర్లను వాడటం మాత్రం మంచిది కాదని.. హానికరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎందుకంటే నూనె వంటకాలను పేపర్‌ మీద వేయగానే దాన్లోని న్యూస్‌ ప్రింట్‌ ఇంక్‌ కరగటం మొదలుపెడుతుంది. ఈ ప్రింట్‌ ఇంక్‌లోని గ్రాఫైట్‌ తినే పదార్థాల్లోకి చేరి నేరుగా శరీరంలోకి చేరుతుంది. గ్రాఫైట్ వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు, కణజాలంపై ప్రభావం చూపుతుంది. తద్వారా వీటి  పెరుగుదల దెబ్బతింటుంది. సాధారణంగా ఎలాంటి హానికారక పదార్థాన్నైనా మన శరీరం సహజసిద్ధంగానే విసర్జిస్తుంది.
 
కానీ గ్రాఫైట్‌ విసర్జింపబడకుండా శరీరంలో నిల్వ ఉండిపోతుంది. కాబట్టి అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్‌ పేపర్లకు బదులుగా టిష్యూ పేపర్లనే ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి న్యూస్‌ పేపర్‌ను చదవటానికి మాత్రమే ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు.