సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (17:42 IST)

చుండ్రుకు సింపుల్ చిట్కా

చుండ్రును నివారించే ఇలా చేయండి . ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, నాలుగు చెంచాల కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు దట్టించి తలకు

చుండ్రును నివారించే ఇలా చేయండి . ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, నాలుగు చెంచాల కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు దట్టించి తలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత తలకు గుడ్డ చుట్టాలి. ఈ గుడ్డను రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేసినా చుండ్రు మాయమవుతుంది. 
 
ఇకపోతే.. గోధుమ మొలకల రసాన్ని రోజూ తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు. జుట్టు మృదువుగా తయారు కావాలంటే.. ఉసిరి పేస్ట్‌ని కానీ లేదా ఉసిరి ఆయిల్‌ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది. ప్రతీ రోజు క్యారెట్ జూస్ తాగితే జుట్టుకు తగిన పోషకాలు అందుతాయి.