శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:21 IST)

న్యూస్ చదువుతుండగా కబుర్లు.. టెక్నికల్ స్టాఫ్‌పై లైవ్‌లోనే ఫైర్ అయిన న్యూస్ రీడర్..!

న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటూ వార్తలు చదివేందుకు అంతరాయం కలిగించిన టెక్నికల్ స్టాఫ్‌పై ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ లైవ్‌లోనే ఫైర్ అయ్యారు. తాను న్

న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటూ వార్తలు చదివేందుకు అంతరాయం కలిగించిన టెక్నికల్ స్టాఫ్‌పై ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ లైవ్‌లోనే ఫైర్ అయ్యారు.

తాను న్యూస్ చదువుతుండగా కబుర్లు చెప్పుకుంటున్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహానికి గురై పెద్దగా అరిచాడు. వారిని ఉద్దేశించి కంట్రోల్ రూమ్‌లో కూర్చున్న వాళ్లెవరో కంట్రోల్ తప్పినట్లున్నారని మండిపడ్డారు.
 
సుత్తి కొట్టడం ఆపండి అంటూ కేకలు పెట్టాడు. ఇలా డానెల్ అరవడంతో పాటు సహనం కోల్పోయిన కారణంగా కాసేపు న్యూస్ చదవడం ఆగిపేశాడు. సుమారు 8 నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోను మీడియా వాచ్ వెబ్ సైట్ 'మీడియేట్' వెలుగులోకి తెచ్చింది. 
 
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో లారెన్స్ వేరే దారి లేక సోషల్ మీడియా ద్వారా సారీ చెప్పాడు. సాంకేతిక సిబ్బంది, సమస్యలు వేధించిన కారణంగా సహనం కోల్పోయానని లారెన్స్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.