శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (20:17 IST)

బాలయ్య ప్రేమతో కొడతారా? ఐతే పూరీకి ఆ కనెక్ట్స్ వున్నాయేమో? హీరోయిన్ షాకింగ్

పైసా వసూల్ చిత్రం ఆడియో వేడుకలో ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలపై ఒకప్పటి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలయ్య తన అభిమానులను ప్రేమతో కొడుతుంటారనీ, అలా కొట్టడం ఆయనకు ప్రేమ పెల్లుబికినప్పుడే చేస్తుంటారని పూ

పైసా వసూల్ చిత్రం ఆడియో వేడుకలో ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలపై ఒకప్పటి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలయ్య తన అభిమానులను ప్రేమతో కొడుతుంటారనీ, అలా కొట్టడం ఆయనకు ప్రేమ పెల్లుబికినప్పుడే చేస్తుంటారని పూరీ అనడంపై టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవారెవరూ నోరు మెదపలేదు. 
 
కానీ ఒకప్పటి తార కస్తూరి మాత్రం ఝలక్ ఇచ్చింది. పూరీ చెప్తున్న మాటలను చూస్తుంటే డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి కనెక్ట్స్ లేకుండా పూరీపై ఆరోపణలు రాలేదేమోనని తనకు డౌటుగా వుందని చెప్పింది. ఇప్పుడామె కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.