శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:36 IST)

జపాన్‌ ఓపెన్ సూపర్ సిరీస్‌: ఒకుహరతో పీవీ సింధు పోటీకి రంగం సిద్ధం

జపాన్‌ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ పూసర్ల వెంకట సింధు, ప్రపంచ ఛాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్)‌తో పోటీకి సై అంటోంది. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లలో రాణించిన పీవీ సింధు

జపాన్‌ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ పూసర్ల వెంకట సింధు, ప్రపంచ ఛాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్)‌తో పోటీకి సై అంటోంది. ఇటీవలే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్‌లలో రాణించిన పీవీ సింధు నొజొమి ఒకుహరతో పోటీకి సిద్ధమైంది. 
 
గత రెండు టోర్నీల్లో ఫైనల్లో తలపడిన వీరిద్దరూ ఈసారి ప్రీక్వార్టర్స్‌లో తలపడే అవకాశం ఉంది. మంగళవారం నుంచి ఈనెల 24 వరకు జరిగే ఈ టోర్నీలో సింధు నాలుగో సీడ్‌గా బరిలో దిగుతుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో మితాని మినత్సు (జపాన్‌)తో సింధు తలపడనుంది. 
 
తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్స్‌లో సింధు ప్రత్యర్థిగా ఒకుహరను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరోవైపు పోర్న్‌పావీ చొచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా నెహ్వాల్‌ తన పోరాటం ప్రారంభించనుంది. ఇటు సింధు.. అటు సైనా క్వార్టర్‌ఫైనల్స్‌ దాటితే సెమీస్‌లో భారత క్రీడాకారిణులు అమీతుమీ తేల్చుకుంటారు.