శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:58 IST)

సూర్యభగవానుడిని ఇలా పూజిస్తే.. గ్రహదోషాలుండవు..

సూర్య భగవానుడిని రోజూ పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండు అరచేతుల నిండా నీరు తీసుకుని సూర్యుడి ముం

సూర్య భగవానుడిని రోజూ పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండు అరచేతుల నిండా నీరు తీసుకుని సూర్యుడి ముందే అంటే తూర్పు వైపు సూర్యుడు మనకు కనబడేలా నిల్చుని.. నీరుని ''ఓం మిత్రాయ నమః'' అని మూడుసార్లు చెప్తూ మూడుసార్లు వదిలి పెడితే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయి. 
 
ఎలాంటి కోరికలైనా కచ్చితంగా నెరవేరుతాయి. నీరు వదిలిన తర్వాత ఎండలో పది నిమిషాల పాటు నమస్కారం చేసుకోవడం ద్వారా ఆరోగ్య పరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ మేలు జరుగుతుంది. గ్రహాలన్నింటిలో అగ్రజుడైన సూర్యుడిని పూజించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది.
 
ఈతిబాధలు తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత.. శుభ్రమైన దుస్తులు ధరించిన గంటలోపు సూర్యునికి అర్గ్యం ఇవ్వాలి. రాగిచెంబును మాత్రమే అర్గ్యానికి వాడాలి. ఈ నీటిలో పంచదార లేదా తేనె కలిపి ఆ నీటితో  సూర్యునికి అర్గ్య మివ్వాలి. ఆదివారం పూట సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. దీనివలన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.