మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (17:52 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 07-09-17

మేషం : ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. రుణం ఏ కొంతైన

మేషం : ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. రుణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు ప్రయత్నం వాయిదా వేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం : ఆదాయ వ్యయాలు మీ స్తోమతకు తగినట్టుగానే ఉంటాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. వివాహ యత్నాలు, నూతన వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. స్త్రీలకు రచన, కళారంగాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. మీ వ్యాఖ్యలను ఇతరులు అపార్థం చేసుకుంటారు.
 
మిథునం : ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. స్త్రీలు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం క్షేమదాయకం.
 
కర్కాటకం: విద్యార్థులకు ఉన్నత, విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. మీ సంతానం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. మీ అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి.
 
సింహం: రేషన్ డీలర్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీరు చూసుకోవడమే ఉత్తమం. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు.
 
కన్య: వ్యాపార రహస్యాలు, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు మొదలెడతారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
తుల : ఆర్థికంగా ఇబ్బంది లేకున్నా ఏదో సాధించలేకపోయామన్న భావం అసంతృప్తి కలిగిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతితో కొత్త విషయాలు చర్చిస్తారు. ఆహార, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం కూడదు.
 
వృశ్చికం: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. కుటుంబీకులు, ఆత్మీయుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. స్త్రీలకు నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తుల సమయస్ఫూర్తి, అంకితభావం అధికారులను ఆకట్టుకుంటారు.
 
ధనస్సు : ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు.
 
మకరం : మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునారోచన మంచిది. వ్యాపారాల్లో ఒకదానిలో వచ్చిన నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. మీ కార్యక్రమాలు, దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
కుంభం : ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ఒకరికి మేలు చేయబోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి వుండాల్సి వస్తుంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ ప్రయత్నం చేయబోయినా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఉంటుంది.
 
మీనం : ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఊహించని ఖర్చులుంటాయి. నేటి కంటే రేపు శుభదినం అన్న ఆశతో మీ యత్నాలు కొనసాగించండి. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. గృహ మార్పు, వాస్తుదోష సవరణల వల్ల ప్రయోజనం ఉంటుంది.