గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (17:53 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 08-09-17

మేషం : దైవదర్శనాలు, పుస్తకపఠనం, ఆత్మీయుల కలయిక వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీ గౌరవాభిమానాలకు

మేషం : దైవదర్శనాలు, పుస్తకపఠనం, ఆత్మీయుల కలయిక వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త పడండి. మీ ప్రమేయం లేకున్నా కొన్ని విషయాల్లో మాటపడక తప్పదు.
 
వృషభం : టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఏ విషయానికి కలిసిరాని మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహపరుస్తుంది. వృత్తుల వారికి కలిసివస్తుంది. కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. గృహ ప్రశాంతత లోపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు పట్టుదలకు పోకుండా సమస్య పరిష్కారానికి ప్రశాంతంగా ఆలోచించాలి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. కష్ట సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి.
 
కర్కాటకం: ఎదుటివారితో మితంగా సంభాషించండి. అధికారుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే సూచనలున్నాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్క్రీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఎదుటివారితో మితంగా సంభాషించండి. ఏ విషయంపైనా ఆసక్తి అంతగా ఉండదు. కళ, సాంకేతిక, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం.
 
సింహం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సమర్థించుకుంటారు. దూరప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. దుబారా ఖర్చులు తగ్గకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. మీ సమర్థత, నిజాయితీలు ఆలస్యంగా వెలుగుచూస్తాయి.
 
కన్య: భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఎంత జఠిలమైన సమస్యనైనా మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం.
 
తుల : వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు వంటివి తలెత్తుతాయి. ఉపాధ్యాయులు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. స్త్రీల ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరవుతారు.
 
వృశ్చికం: అధికారుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే సూచనలున్నాయి. మీ కుటుంబీకుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందడంతో మానసికంగా కుదుటపడతారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
ధనస్సు : వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మకరం : వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధికమిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రముఖుల కోసం ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం.
 
కుంభం : కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రుణం కొంత మొత్తమైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
మీనం : ఆర్థికలావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ సంతానం కదలికలపై దృష్టి సారించండి. స్త్రీలు విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి.