సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (17:50 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 06-09-2017

మేషం : వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. స్త్రీలు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కొంట

మేషం : వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. స్త్రీలు షాపింగ్‌లోనూ, కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. రుణ యత్నం వాయిదా పడుతుంది. మతిమరుపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం : ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలు వుంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు.
 
మిథునం : దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయం అవుతుంది. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం.
 
కర్కాటకం : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం ద్వారా అస్వస్థతకు లోనవుతారు. ఇంటా బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. మీ సంతానానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
సింహం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యులలో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు.
 
కన్య: మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. సోదరులతో స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి.
 
తుల: బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. 
 
వృశ్చికం : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం ద్వారా అస్వస్థతకు లోనవుతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
ధనస్సు: మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది.
 
మకరం : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగా ఉంటుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులకు సంతృప్తి చేకూరుతుంది. గతంలో చేజారిన పత్రాలు చేతికి అందుతాయి.
 
కుంభం : కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఊహించని ఖర్చులు అధికం కావడం వలన ఆందోళన చెందుతారు. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు.
 
మీనం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారులకు పురోగతి కానవస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పనుల్లో జాప్యం తప్పదు.