శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (12:02 IST)

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. చేపలు తినండి..

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లను ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. చేపలు తిననివార

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్లను ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి కనీసం రెండు సార్లైనా చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు.

చేపలు తిననివారు బదులుగా ఒమేగా -3 ఫాటీ యాసిడ్లు ఉండే అవిసెగింజలూ, బాదం, వాల్‌నట్లూ, పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని తీసుకోవాలి. విటమిన్‌ సి ఉండే పండ్లు తినడం కూడా తప్పనిసరే. చక్కెరశాతం తక్కువగా ఉండే పదార్థాలనే ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇక కీళ్ల నొప్పులకు అధికబరువు కూడా ఒక కారణమే. బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చేస్తూనే పండ్లూ, తాజా కూరగాయలూ, ఆకుకూరలూ, చిరు ధాన్యాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

అలాగే యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే సి.విటమిన్‌ ను తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.