సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (12:04 IST)

కంటికి మేలు చేసే ఖర్జూరాలు..

కంటి ఆరోగ్యానికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో వుండే.. జియాక్సిథిన్, టూటిన్స్ కంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇందులోని ఐ విటమిన్ దృష్టి లోపాలను తొలగిస్తాయి. అలాగే ఖర్జూరల్లో వుండే ఐరన్ హీమోగ్

కంటి ఆరోగ్యానికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో వుండే.. జియాక్సిథిన్, టూటిన్స్ కంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇందులోని ఐ విటమిన్ దృష్టి లోపాలను తొలగిస్తాయి. అలాగే ఖర్జూరల్లో వుండే ఐరన్ హీమోగ్లోబిన్‌ను పెంచి, రెడ్ బ్లడ్ సెల్స్‌ను పెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్ లోపం వల్ల అనీమియా దారీతీస్తుంది. ఐరన్ పొందాలంటే, అనీమియాకు చెక్ పెట్టాలంటే.. రోజుకు మూడు డేట్స్ తినడం మంచిది.
 
ఇంకా డేట్స్‌లో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది డయోరియాను నివారించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. గర్భవతులు తప్పకుండా ఖర్జూరాలను తీసుకోవాలి. ప్రసవానికి ఒక నెల ముందు నుండి డేట్స్ తీసుకోవడం వల్ల ప్రసవ నొప్పులు, బ్లీడింగ్ సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు, ఇలా ప్రసవానికి ముందు ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 
ఖర్జూరాల్లో వుండే హెల్తీ న్యూట్రీషియన్స్ బరువును తగ్గిస్తాయి. పరగడుపు డేట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. హృద్రోగ సమస్యలతో బాధపడే వారు రోజుకు మూడు డేట్స్ తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లలో మూడు డేట్స్‌ను నానబెట్టి, ఉదయం పరగడుపున తినాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తింటే చాలు గుండెపోటును నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.