మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 అక్టోబరు 2017 (14:30 IST)

రజినీకాంత్ 2.O అంతా సైంటిఫిక్కేనట... నేడే దుబాయ్‌లో ఆడియో...

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం అంటే అదో కిక్కు. ఆయన స్టైల్, మేనరిజం అంటే పిచ్చెక్కిపోతారు తమిళ కుర్రకారు. ఆ మాటకొస్తే ఆ ఫీవర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వుంది. ఐతే కొన్ని చిత్రాలు ఆయనకు దెబ్బేసినవీ లేకపోలేదు. కానీ మాగ్జిమమ్ సేఫ్ జోన్ల

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం అంటే అదో కిక్కు. ఆయన స్టైల్, మేనరిజం అంటే పిచ్చెక్కిపోతారు తమిళ కుర్రకారు. ఆ మాటకొస్తే ఆ ఫీవర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వుంది. ఐతే కొన్ని చిత్రాలు ఆయనకు దెబ్బేసినవీ లేకపోలేదు. కానీ మాగ్జిమమ్ సేఫ్ జోన్లోనే ఆయన చిత్రాలు పయనిస్తాయి. రజినీ 2.O చిత్రం అంతా సైంటిఫిక్ ట్రిక్కులు, ట్విస్టులతో సాగుతుందట. 
 
ఇకపోతే రజినీకాంత్ 2.O చిత్రం ఆడియో వేడుకను ఈ రోజు దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం లుక్స్ వదులుతూ ఓ విధమైన క్రేజ్ తెచ్చారు. చిత్రం ఆడియోకు కమల్ హాసన్ కూడా హాజరవుతారని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్ డే నాడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్ర దర్శకుడు శంకర్ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుతో కలిసి భారతీయుడు చిత్రం సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన శిష్యుడు, దర్శకుడు అట్లీ...  విజయ్‌తో 'మెర్సల్ చిత్రం తీసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్న నేపధ్యంలో తదుపరి శంకర్ చిత్రం ఎలా వుంటుందన్న ఆసక్తి నెలకొని వుంది.