బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2017 (11:09 IST)

శివ పూజకు షరతులు? మినరల్ వాటర్‌తోనే అభిషేకం...

శివ పూజకు షరతులు పెట్టారు. దీంతో ఇకపై అన్ని రకాల పూజలు, అభిషేకాలు ఈ షరతులకు లోబడే నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

శివ పూజకు షరతులు పెట్టారు. దీంతో ఇకపై అన్ని రకాల పూజలు, అభిషేకాలు ఈ షరతులకు లోబడే నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
దేశంలోనే అత్యంత పురాతన ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం ఒకటి. ఇక్కడ నిత్యం జరిగే అభిషేకాలకు మహాజ్యోతిర్లింగం కరిగిపోతుండటంతో అభిషేకాలు, ఇతర పూజలకు సంబంధించి ఎనిమిది షరతులు పెట్టింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాయంతో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు ఆమోదించింది. 
 
ఈకొత్త నిబంధనల మేరకు మహాలింగానికి జలాభిషేకం చేసేందుకు ఒక్కో భక్తుడు కేవలం అర లీటర్ నీటిని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అదీకూడా కేవలం రివర్స్ ఆస్మోసిస్ (మినరల్ వాటర్) చేసిన నీటినే వినియోగించాల్సి ఉంటుంది. ఇక పాలు లేదా పాలు, పెరుగు, తేనే, చక్కెర, నెయ్యి కలిపి చేసే పంచామృతంతో… చేసే అభిషేకానికి లీటరుంపావు పరిమితి పెట్టింది. 
 
అంటే లీటరుంపావు పాలు లేదా పంచామృతంతోనే ఒక్కో భక్తుడు అభిషేకం పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆలయ గర్భగుడిలో తేమ లేకుండా పొడిగా  మార్చడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టాలి. అలాగే శివలింగంపై పంచదార పొడి చల్లకూడదు. దానికి బదులుగా కలకండ చక్కెరను మాత్రమే వినియోగించాలి. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి అభిషేకాలు నిర్వహించకూడదు. ఇతర పూజలకు మాత్రం అనుమతి ఉంటుంది.