సంబంధిత వార్తలు
- రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకుందాం.. ప్రజల తీర్పుకే వదిలేసిన సంకీర్ణ ప్రభుత్వం
- లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం
- పాఠశాలల్లో ఫీజులను యూపీఐ ద్వారా వసూలు చేయండి
- వైద్య విద్యార్థినిపై అత్యాచారం - పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
- Hyderabad: పట్టపగలే దొంగ కంటపడ్డాడు.. తరుముకున్న బాలిక.. చుక్కలు చూపించిందిగా (video)
Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?
Kalashtami 2025
ఈరోజున కాల భైరవుని కథను వినడం, శివుడిని ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. కాల భైరవుని వాహనంగా చాలా మంది నల్లకుక్క అని భావిస్తారు. అందుకే ఈరోజున దానికి పాలు, పెరుగు, స్వీట్స్ వంటి ఆహారంగా పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది. బ్రాహ్మణులకు అన్నదానం లేదా వస్త్రదానం లేదా డబ్బుదానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజున పితృదేవతలను ఆరాధించడం వల్ల వారి ఆత్మకు చేకూరుతుంది.
సాయంత్రం వేళ భక్తులు కాలభైరవుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపుగా ప్రతి శివాలయంలో కాలభైరవుని విగ్రహం కూడా ఉంటుంది. కాలభైరవుని సమక్షంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివ స్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి. అనంతరం 11 ప్రదక్షిణలు చేయాలి. కాల భైరవునికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
భక్తిశ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. అంతేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.
