Hyderabad: పట్టపగలే దొంగ కంటపడ్డాడు.. తరుముకున్న బాలిక.. చుక్కలు చూపించిందిగా (video)
Girl
బాలికను చూడగానే దొంగ పరుగులు తీయడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ భవానీ అతడిని వదలక అతనిని పట్టుకునేందుకు పరుగులు పెట్టింది. ప్రాణాలకు తెగించి మరీ అతడిని వెంబడించింది. భవానీ అడ్డుకోవడంతో దొంగ చోరీ చేయకుండానే పారిపోయాడు.
చుట్టు పక్కన ఎవరూ లేకపోయినా.. భవానీ ఎంతో ధైర్యంతో దొంగను ఎదురించింది. ఈ బాలిక ధైర్య సాహసాలపై కాలనీ వాసులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
13ఏళ్ల బాలిక దొంగను తరిమేసింది
— greatandhra (@greatandhranews) October 11, 2025
చింతల్‌లోని భగత్‌సింగ్ నగర్‌లో ఓ దొంగ ఇంట్లోకి చొరబడగా, పైపోర్షన్లో ఉన్న 13ఏళ్ల భవాని గమనించి ప్రశ్నించింది.
దొంగ పరారైపోతుండగా ఆమె కేకలు వేస్తూ వీధి చివరి వరకు వెంబడించింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. pic.twitter.com/JhbvBzZltX
