శనివారం, 11 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 11 అక్టోబరు 2025 (11:51 IST)

Keerthy Suresh: ప్రేమ - కోపం - రక్తం కథాంశంగా విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ చిత్రం ప్రారంభం

Allu Aravind Clap - Vijay devarakonda, keerthi suresh
Allu Aravind Clap - Vijay devarakonda, keerthi suresh
చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నవిజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఈరోజు శుభ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ లో 59 చిత్రంగా రూపొందుతోంది. ఇందులో నాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను కొద్దిసేపటి క్రితమే చిత్ర టీమ్ తెలియజేసింది. దేవునిపటాలపై ముహూర్తపు షాట్ కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.
 
ఈరోజు జరిగిన ముహూర్త కార్యక్రమంలో కీర్తి సురేష్, దేవరకొండ, దిల్ రాజు, దర్శకుడు తదితరులు పాల్గొన్నారు. మహానటి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాలో ఆమె నటించడం కూడా ప్రత్యేక సంతరించుకుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. 
 
కాగా, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ తగు విధంగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ సినిమాలోని పలు జాగ్రత్తలను ఈ సినిమాకోసం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం విజయ్ దేరకొండను దర్శకుడు రవికిరణ్ కోలా  సరికొత్తగా మార్చాడు. మీసాలతో పోలీస్ కానీ మిలట్రీ నేపథ్యంగానీ వుండవచ్చుని తెలుస్తోంది. అందుకే ప్రేమ - కోపం - రక్తం కథాంశంగా వుంటుందని సూచాయిగా తెలియజేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.