సోమవారం, 1 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2025 (22:32 IST)

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Shukra Gochar 2025
Shukra Gochar 2025
నవగ్రహాల్లో ప్రతి గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు మానవ జాతకాల్లో శుభ, అశుభ ఫలితాలు ఏర్పడుతాయి. తాజాగా శుక్రుడు తన రాశి స్థానాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడి అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు. అలాంటి శుక్రుడు ఒక అద్భుతమైన రాజయోగాన్ని తీసుకురాబోతున్నాడు. 
 
2025 అక్టోబర్9న శుక్రగ్రహం కీలకమైన సంచారం చేసింది. అక్టోబర్ 9 ఉదయం 10:55 గంటలకు శుక్రుడు తన మిత్రుడు బుధుడి రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించాడు. కన్యరాశిలోకి శుక్రుడు ప్రవేశించడంతో మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. 
 
శుక్రగ్రహ సంచారం కారణంగా కన్య, సింహం, వృశ్చిక రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి.
 
తొలుత సింహ రాశి వారికి కన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశం వల్ల అద్భుత యోగం చేకూరుతుంది. జీవితం సుఖమయం అవుతుంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం సమకూర్చుకోవాలనే ఈ కల నెరవేరుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి గడిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. 
 
అలాగే శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నందున వీరికి ఇది అత్యంత యోగవంతమైన కాలం. ఈ సంచారం మీ జాతకంలో అదృష్టం, భాగ్యాన్ని సూచించే తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. అదృష్టం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. ఆర్థికంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. గతంలో ఎదుర్కొన్న అడ్డంకులు, సమస్యలు మంచులా కరిగిపోతాయి. 
 
జీవితాన్ని ఒక సరికొత్త ఉత్సాహంతో ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రమాదాలు, ఆటంకాలు తొలగిపోయి మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కన్యారాశి వారికి స్వర్ణయుగం అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఇక వృశ్చిక రాశి వారికి శుక్రుడి సంచారం ఒక సువర్ణావకాశంలాంటిది. ఈ గ్రహ మార్పు జాతకంలో ఆదాయం, లాభాలను సంపాదించిపెడుతుంది. ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. 
 
మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవులు, ప్రమోషన్లు వరిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సామాజికంగా కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి.