శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (08:35 IST)

రేప్‌లకే కాదు... విషపు గాలులకు కూడా కేంద్రంగా ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యాచారాలకు కేంద్రంగా ఉంది. దేశపాలకులు నివశించే ఢిల్లీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని ఇప్పటికే తేలిపోయింది. ఈనేపథ్యంలో విషపు గాలులకు కూడా ఢిల్లీ కేంద్రంగా మారింది.

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే అత్యాచారాలకు కేంద్రంగా ఉంది. దేశపాలకులు నివశించే ఢిల్లీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని ఇప్పటికే తేలిపోయింది. ఈనేపథ్యంలో విషపు గాలులకు కూడా ఢిల్లీ కేంద్రంగా మారింది. 
 
సాధారణంగా మామూలుగా గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ, ఢిల్లీలో గాలి పీలిస్తే ప్రాణాలుకోల్పోతారు. దీనికి కారణం... అది మామూలు గాలి కాదు.. విషపు గాలి. మూతికి మాస్కు లేకుండా బయటికి రాలేనిపరిస్థితి.. ముందున్న వాహనం కనిపించనిదుస్థితి.. వాయు కాలుష్యం అన్ని వైపుల నుంచి కప్పేస్తుంటే హస్తిన ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. 
 
దీంతో దేశ రాజధాని కాస్తా కాలుష్యానికి క్యాపిటల్‌గా మారింది. ఏటా ఢిల్లీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను చూస్తోంది. కానీ, దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం అటు ఢిల్లీ పాలకులు, ఇటు కేంద్ర పాలకలు కనిపెట్టలేక పోతున్నారు. ఫలితంగా ఢిల్లీలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. 
 
ఇల్లూ, ఆఫీసు, మెట్రో స్టేషన్లు, రోడ్లు.. పార్కులు... ఇలా అక్కడా.. ఇక్కడా అనే తేడా లేదు. అన్ని చోట్లా కలుషిత గాలి చేరుతోంది. ఇదిలాగే సాగితే కొన్నాళ్లకు దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ఊహించటం కూడా కష్టమే అనిపిస్తోంది.