శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (16:22 IST)

గన్ పాయింట్‌లో దోపిడీ.. (వీడియో)

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు ఘోరాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. తాజాగా ఓ వ్యక్తిని నలుగురు యువకులు గన్ పాయింట్‌లో దోచుకున్నార

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు ఘోరాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని అనేక సర్వేలు తేటతెల్లం చేశాయి. తాజాగా ఓ వ్యక్తిని నలుగురు యువకులు గన్ పాయింట్‌లో దోచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఢిల్లీలోని పూస రోడ్డులో ఈ దారుణం జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు బైక్‌లపై వచ్చి.. రోడ్డుపై ఆగి ఉన్న ఓ వ్యక్తి వద్ద మాటలు కలిపారు. తలలకు హెల్మెట్స్ ధరించిన దుండగులు.. పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బంగారం గొలుసును, నగదును దోచుకున్నారు. 
 
అనంతరం అక్కడ్నుంచి దొంగలు పారిపోయారు. ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.