సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (11:13 IST)

నతాలీకి లో దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి అనుభవం ఎదురైందో తెలుసా?

నతాలీ అనే అమ్మాయికి ఎదురైన అనుభవం ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళ్లి, నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకుని ట్రైయల్ చూడటం అలవాటే. అలా నతా

నతాలీ అనే అమ్మాయికి ఎదురైన అనుభవం ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళ్లి, నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకుని ట్రైయల్ చూడటం అలవాటే. అలా నతాలీ ప్రైమాక్స్ స్టోరుకు వెళ్లి లోదుస్తులను ఎంచుకుంది. ట్రైయల్‌లో తనకు నప్పడంతో బ్రా తీసుకుని బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చింది. అయితే అక్కడే అసలు సంగతి బయటపడింది. 
 
నతాలీకి నచ్చిన బ్రాకు ప్రైస్ కోడ్ లేదు. అంతే సూపర్ వైజర్‌ను సంప్రదించింది. అతను కాసేపు అటూ ఇటూ తిరిగి చివరకు.. అది తమ షాపుకు చెందిన బ్రా కాదని తేల్చేశాడు. దీన్ని ఎవరో కావాలనే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారని.. ఎవరో వాడేసిన బ్రా హ్యాంగర్‌కు తగిలించారని చెప్పాడు. అంతేగాకుండా కొత్తది తీసుకెళ్లిపోయారన్నాడు. అంతే నతాలీ షాక్ అయ్యింది. 
 
ఎవరో వాడేసిన బ్రాను తాను ట్రైయల్‌ చూసుకున్నానా అంటూ నతాలీ తన అనుభవాన్ని ట్విట్టర్లో తెలిపింది జనవరి 31న ఆమె ఈ పోస్టును పెట్టగా, సుమారు రెండున్నర లక్షల మంది లైక్ కొట్టారు. మరో 48 వేల మంది ఈ ట్వీట్ కు రీట్వీట్ చేశారు.