నన్ను పాకిస్థానే నిర్భంధించింది.. భారత్, అమెరికా కాదు: హఫీజ్ సయీద్
గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తెలిపాడు. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైన సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలపై ఇప్పటికే పది మిల
గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తెలిపాడు. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడైన సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా అతడి తలపై ఇప్పటికే పది మిలియన్ డాలర్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తనను గృహ నిర్భంధం చేసింది భారత దేశం కాదని సయీద్ అన్నాడు.
కాశ్మీర్ సమస్య నుంచి తనను దూరంగా ఉంచాలని పాకిస్థాన్ సర్కారు భావించిందని లాహోర్ జరిగిన ఓ కార్యక్రమంలో సయీద్ తెలిపాడు. గతంలో తనను మోదీ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం నిర్భంధించిందని ఆరోపించిన సయీద్ ప్రస్తుతం మాట మార్చారు.
కాగా 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో సయీద్ కీలక సూత్రధారి కావడంతో భారత్, అమెరికా తీవ్ర ఒత్తిడి కారణంగా తనను నిర్భంధించినట్టు చెప్పుకొచ్చాడు. కానీ ప్రస్తుతం తనను పాకిస్థానే పదినెలల పాటు నిర్భంధించిందని తెలిపాడు.