బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:06 IST)

రాజౌరీ సెక్టార్‌లో పాక్ సైనికుల బుల్లెట్ల వర్షం... నలుగురు సైనికుల మృతి

శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌర

శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 
 
పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో ఆర్మీ సెంకెండ్ ఆఫీసర్ కెప్టెన్ కపిల్ కుందు ఉన్నారు. నలుగురు స్థానికులు గాయపడ్డారు. గత 40 రోజులుగా పాక్ జరుపుతున్న కాల్పుల్లో ఆర్మీ అధికారి చనిపోవడం ఇది రెండోసారి.
 
పాక్ కాల్పులతో విరుచుకుపడుతుండటంతో రాజౌరీ సెక్టార్‌లో సరిహద్దుకు సమీపంలో ఉన్న 84 పాఠశాలలను మూసివేయించారు. మూడు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అలాగే సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో మిగతా వారిని రైఫిల్ మ్యాన్‌లు రామ్ అవతార్, శుభం సింగ్, హవల్దార్ రోషన్ లాల్, జవాను నియాక్ ఇక్బాల్ అహ్మద్‌లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.