1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:55 IST)

ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన శ్రీదేవి పిన్ని

అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుం

అందాల నటి శ్రీదేవి మృతిని ఇప్పటికీ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవికి మరణం ఉందా అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. శ్రీదేవిలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యాంతమవుతున్నారు. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తన చేతిలో ఎత్తుకుని పెంచిన శ్రీదేవి పిన్ని అనసూయమ్మకు ఏడుపు ఆగడం లేదు. గత రెండురోజులుగా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా బోరున విలపిస్తూనే ఇంట్లో కూర్చుండిపోయింది. 
 
శ్రీదేవి.. శ్రీదేవి అంటూ ఆమెనే తలుచుకుంటూ కూర్చుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఎంత ఓదార్చినా ఏడుపు అపుకోవడం ఆమెవల్ల కావడం లేదు. అలా ఏడ్చిఏడ్చి నీరసించిపోయి చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి ఆమెను తరలించారు. కాగా, తిరుపతిలోని పద్మావతిపురంలో శ్రీదేవి పిన్ని నివాసముంటోంది. ఈమె శ్రీదేవి తల్లికి స్వయానా చెల్లెలు.