శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (15:18 IST)

భారత ఎంబసీకి క్లియరెన్స్ లెటర్.. ఈ రాత్రికి ముంబైకు శ్రీదేవి భౌతికకాయం

దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి స్వదేశానికి రానుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ లేఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అం

దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి స్వదేశానికి రానుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ లేఖ దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి అందింది. దీంతో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో ముంబైకు తరలించనున్నారు. 
 
ప్రస్తుతం క్లియరెన్స్ లేఖతో మార్చురీ నుంచి శ్రీదేవిని ఎంబాల్మింగ్‌కు ప్రక్రియకు తరలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఈ సాయంత్రం 5 గంటలకు ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి తీసురానున్నారు. ముంబై - దుబాయ్ ప్రాంతాల విమాన ప్రయాణ సమయం మూడు గంటలు. అంటే.. శ్రీదేవి మృతదేహం రాత్రి 9 లేదా రూ.10 గంటల సమయానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.