శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:01 IST)

చెల్లీ అంటూ శ్రీదేవిని గర్భవతిని చేసిన బోనీ కపూర్.. నిజమా?

నటి శ్రీదేవి మరణంతో ఆమె వివాహానికి ముందు.. వివాహం తర్వాత ఎదుర్కొన్న అనేక సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు బోనీ కపూర్ చేసిన చేసిన జిమ్మిక్కులు, ఇతర

నటి శ్రీదేవి మరణంతో ఆమె వివాహానికి ముందు.. వివాహం తర్వాత ఎదుర్కొన్న అనేక సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు బోనీ కపూర్ చేసిన చేసిన జిమ్మిక్కులు, ఇతర కుట్రలు కుతంత్రాలన్నీ ఇపుడిపుడే బహిర్గతమవుతున్నాయి. 
 
ముఖ్యంగా, బాలీవుడ్‌లో శ్రీదేవి అడుగుపెట్టిన తర్వాత హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడింది. ఈ కారణంగా వీరిద్దరూ 1985లో రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయం మిథున్ తొలి భార్య యోగితకు తెలియడం, ఆమె బెదిరించడం, ఆ తర్వాత శ్రీదేవి దూరంగా కావడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత బోనీ కపూర్ దగ్గరకు చేరదీయగా, ఆయన తొలి భార్య మోనా కపూర్ కూడా శ్రీదేవికి అండగా నిలిచింది. ఆ సమయంలో శ్రీదేవిని బోనీ కపూర్ సోదరిగా పిలుస్తూ వచ్చాడు. 
 
బోనీతో ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. 1987లో తాను ప్రకటించిన భారీ బడ్జెట్‌ సినిమా 'రూప్‌ కీ రాణీ.. చోరోం కా రాజా'ను బోనీ కపూర్‌ తన డబ్బంతా వెచ్చించి అనిల్‌ కపూర్‌, శ్రీదేవిలతో తీశాడు. ఆ సినిమా మధ్యలో డైరెక్టర్‌ మారడం, ఇతర కారణాల రీత్యా చిత్రీకరణ ఆలస్యమైంది. 1993లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అట్టర్‌ఫ్లాపైన సినిమాతో బోనీ తీవ్ర నష్టాల్లో కూరుకున్నాడు. అపుడాయనకు శ్రీదేవి ఓ బంగారు బాతులా కనిపించింది. 
 
ఆ సమయంలో శ్రీదేవి కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నారు. మిథున్‌తో చెడిన బంధం ఒక పక్క బాధపెడుతుండగా ఆమె తల్లి రాజేశ్వరి అనారోగ్యానికిగురై మరణించింది. ఆస్తి విషయంలో చెల్లెలు శ్రీలత చేసిన మోసం ఆమెను కలచివేసింది. ఆ పరిస్థితుల్లో తానున్నానంటూ బోనీ ఆమెకు అండగా నిలిచాడు. రాజేశ్వరి కూడా తననే అల్లుడిగా కోరుకున్నారని శ్రీదేవిని నమ్మించారు. చివరకు 3 నెలల తర్వాత బోనీతో సాన్నిహిత్యం పెంచుకున్న శ్రీదేవి ఆ క్రమంలో పెళ్లి కాకుండానే గర్భం దాల్చినట్లు బాలీవుడ్‌లో ఓ వార్త గుప్పుమంది. 
 
ఈ విషయం బోనీ కపూర్ తొలి భార్య మోనా కపూర్‌ కూడా స్పందించారు. 'నా కంటే బోనీ పదేళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకున్నాను. పదమూడేళ్ల సంసార జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగారు. అపుడు ఈమె (శ్రీదేవి) ప్రవేశించింది.. నేనేమైనా చేద్దామనుకుంటే ఆమె అప్పటికే గర్భిణి' అంటూ మోనా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే, శ్రీదేవి పెట్టిన షరతు కారణంగా తొలి భార్య మోనాతో పాటు... ఇద్దరు పిల్లలను బోనీ కపూర్ వదిలివేశాడు. అలా సోదరితో తన సంబంధాన్ని కొనసాగించిన బోనీ... చివరకు శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.