మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (12:10 IST)

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం అసాధ్యం: సుబ్రహ్మణ్య స్వామి

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడు ముందుండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. శ్రీదేవిది హత్యేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశార

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడు ముందుండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. శ్రీదేవిది హత్యేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీదేవిది హత్యేనని తాను చేసిన కామెంట్లు తన అభిప్రాయమేనని స్పష్టం చేశారు. 
 
అంతేకాదు.. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి కావడంపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజి ఏమైందని స్వామి ప్రశ్నించారు. ఇదంతా చూస్తే శ్రీదేవి హత్యకు గురయ్యే వుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి మరణించడం అనేది సిల్లీగా వుందని.. బాత్ టబ్‌లో గట్టిగా తోసేస్తే కానీ మృతి చెందే అవకాశం లేదని స్వామి వ్యాఖ్యానించారు. 
 
ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ విషయాలను ప్రకటించే వరకు వేచివుండాల్సిన అవసరం వుందని స్వామి వ్యాఖ్యానించారు. కాగా శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయిందని చెప్తోంది.