శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (10:50 IST)

నిజంగానే 300 సినిమాల్లో నటించారా?: శ్రీదేవిని ప్రశ్నించిన ఓర్లాండో

శ్రీదేవి మృతి దేశ సినీ ప్రపంచంతో పాటు పాటు అంతర్జాతీయ సినీతారలకు కూడా షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కింగ్ డమ్ ఆఫ్ హెవెన్ యాక్టర్, హాలీవుడ్ స్టార్ ఓర్లాండో బూమ్ కూడా శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందా

శ్రీదేవి మృతి దేశ సినీ ప్రపంచంతో పాటు పాటు అంతర్జాతీయ సినీతారలకు కూడా షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కింగ్ డమ్ ఆఫ్ హెవెన్ యాక్టర్, హాలీవుడ్ స్టార్ ఓర్లాండో బూమ్ కూడా శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాడు.

పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓర్లాండో 2015లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత శీతల్ తల్వార్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ పర్యటనకు వచ్చాడు. ఆయన గౌరవార్థం సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ తన నివాసంలో పలువురు ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. 
 
మాజీ ఎంపీ అమర్ సింగ్ ఆహ్వానం మేరకు ఈ విందులో పాల్గొన్న శ్రీదేవిని 300లకు పైగా సినిమాల్లో నటించిన నటీమణి అంటూ శీతల్ తల్వార్, ఓర్లాండోకు పరిచయం చేశారు. దీంతో ఓర్లాండో షాక్ అయ్యాడు.

శ్రీదేవిని అభినందిస్తూ.. మేడమ్ మీరు నిజంగా 300 సినిమాల్లో నటించారా? ఇంతకీ అన్ని సినిమాలు ఎలా చేయగలిగారు? అంటూ అడిగారు. అయినా అన్ని సినిమాలు చేసేందుకు మీకు ఎంత సమయం పడుతుందని అడిగారు. ఓర్లాండో ప్రశ్నలకు శ్రీదేవి చిరునవ్వుతో సమాధానం చెప్పారట. ఈ విషయాన్ని ఓర్లాండో గుర్తు చేసుకున్నారు. ఇంకా శ్రీదేవి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.