మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (12:32 IST)

శ్రీదేవి హత్య వెనుక దావూద్ హస్తం?

యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసిన అందాలనటి శ్రీదేవి హత్య వెనుక మాఫియా డాన్ దావూద్ హస్తముందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి

యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసిన అందాలనటి శ్రీదేవి హత్య వెనుక మాఫియా డాన్ దావూద్ హస్తముందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. 
 
శ్రీదేవిది సహజమరణం కాదని, హత్యేనని.. ఆమె మృతి మిస్టరీ వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నాడని స్వామి అనుమానం వ్యక్తంచేశారు. సినిమా తారలతో దావుద్‌కు ఉన్న సంబంధాలపై విచారణ జరపాలని సుబ్రమణియన్ డిమాండ్ చేశారు.
 
అంతేకాకుండా, శ్రీదేవి బస చేసిన హోటల్‌ గదికి ఎవరు వెళ్లారో బయట పెట్టాలని సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేశారు. శ్రీదేవి ఉన్న హోటల్ రూంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని స్వామి ప్రశ్నించారు. 
 
శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదని చెప్పిన సుబ్రమణియన్ స్వామి.. మరి ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉందని ప్రశ్నించారు. శ్రీదేవితో ఎవరైనా బలవంతంగా మద్యం తాగించి బాత్‌టబ్‌లో ముంచి చంపేశారా అనే విషయాన్ని తేల్చాలని స్వామి డిమాండ్ చేశారు.
 
మరోవైపు, ముంబై మాఫియా డి గ్యాంగ్‌ ముఠా సభ్యులు చేసే హత్యలన్నీ ఇలానే ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. హత్యకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా, కనిపించకుండా చేయడంలో డి గ్యాంగ్ ఆరితేరిందనీ, ఇదే తరహాలోనే శ్రీదేవి హత్య జరిగివుంటుందని క్రైమ్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.