సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (15:00 IST)

ఐడియా... అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్

దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఐడియా అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉన్న యూజర్లను నిలుపుకునేందుకు, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వీలుగా టెలిక

దేశంలోని ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఐడియా అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఉన్న యూజర్లను నిలుపుకునేందుకు, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వీలుగా టెలికాం కంపెనీలు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్లు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. తాజాగా ఐడియా సెల్యులార్ కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఐడియా లాంచ్ చేసింది. ఇప్పటివరకు ఆయా టెలికాం సంస్థలు ప్రత్యేకించి కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు మాత్రమే క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నాయి. కొత్త ఆఫర్ ద్వారా సబ్‌స్రైబర్లు తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. 
 
ఈ ఆఫర్‌లో భాగంగా ప్రీపెయిడ్ వినియోగదారులు తొలి 18నెలల పాటు ప్రతినెలా రూ.199, అంతకన్నా ఎక్కువ రీఛార్జి చేసుకోవాల్సి ఉంది. రూ.3 వేలు పూర్తి కాగానే రూ.750 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇదేవిధంగా మిగతా 18 నెలల పాటు రీఛార్జి చేసుకుంటే మిగతా రూ.1250 చివరి నెల గడువు పూర్తికాగానే ఈ మెత్తాన్ని జమచేయనుంది.