శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (18:45 IST)

రూ.4వేలకే బిగ్‌బజార్‌లో జియోమి 5ఏ- ఆఫ్‌లైన్‌లోనే..?

జియోమి నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ఏ మొబైల్ ఫోన్ ఆఫ్‌లైన్‌ మార్కెట్లో ఆఫర్ రేటుతో విక్రయించబడుతోంది. రెడ్ మీ 5ఏ స్మార్ట్ ఫోన్ బిగ్ బజార్ ద్వారా ఆఫ్‌లైన్‌లో అమ్మబడుతోంది. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని.. ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించ

జియోమి నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ఏ మొబైల్ ఫోన్ ఆఫ్‌లైన్‌ మార్కెట్లో ఆఫర్ రేటుతో విక్రయించబడుతోంది. రెడ్ మీ 5ఏ స్మార్ట్ ఫోన్ బిగ్ బజార్ ద్వారా ఆఫ్‌లైన్‌లో అమ్మబడుతోంది. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని.. ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో రిపబ్లిక్ డే సూపర్ సేల్‌లో రెడ్‌మీ 5ఏ-2జీబీ రోమ్ మోడల్ రూ.4వేలకు ఆఫ్‌లైన్‌లో అమ్మబడుతోంది.
 
ఫ్లిఫ్‌కార్ట్ ఇతరత్రా ఈ-కామెర్స్ సైట్లలో జియోమీ రెడ్ మీ 5ఏ రేటు రూ.5,999లకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బజార్ జియోమీ రెడ్ మీ 5ఏలో 2జీబీ/16జీబీ డివైస్, 3జీబీ/32జీబీ ఫోన్, గార్బ్ ఏ మొబైల్ మోడల్స్‌లో ఈ ఫోన్ బిగ్ బజార్లో లభిస్తోంది. ఈ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వుందని వార్తలు వస్తున్నాయి.