శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (11:43 IST)

బెంగళూరుతో ఐపీఎల్ మ్యాచ్: 46 పరుగులతో ముంబై ఇండియన్స్ విన్

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో

ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది.  కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో 65) చెలరేగి ఆడటంతో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 
 
తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబైకి బ్యాటింగ్ అప్పగించాడు. రోహిత్ శర్మ ఎవిన్ లూయిస్ సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు 167 పరుగులకే పరిమితమైంది. 
 
బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి (62 బంతుల్లో 92 పరుగులు) పోరాడినా మిగిలిన బ్యాట్స్‌మన్ నుంచి సహకారం లేకపోవడంతో భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించలేకపోయింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది.