1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
  4. IPL 2017: Amitabh Bachchan adds to glitz in Mumbai Indians

అమితాబ్ సంకుచిత బుద్ధి.. ముంబై ఓడిపోతుందని టీవీ కట్టేశారట?

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. యావత్ భారత్ అభిమానించే నటుడు. అలాంటి బిగ్ బిలో సంకుచిత బుద్ధి ఉంటుందని ఓ సంఘటన ద్వారా నిరూపితమైంది. నెలన్నర రోజుల పాటు ఆలరించిన ఐపీఎల్ టోర్నీ గత ఆదివారం జరిగిన ఫై

IPL 2017: Amitabh Bachchan
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. యావత్ భారత్ అభిమానించే నటుడు. అలాంటి బిగ్ బిలో సంకుచిత బుద్ధి ఉంటుందని ఓ సంఘటన ద్వారా నిరూపితమైంది. నెలన్నర రోజుల పాటు ఆలరించిన ఐపీఎల్ టోర్నీ గత ఆదివారం జరిగిన ఫైనల్ పోరుతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో పూణె, ముంబై జట్లు తలపడగా, చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు గెలుపును సొంతం చేసుకుంది. 
 
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ అమితాబ్ బుద్ధి... సంకుచిత గుణం బయటపడింది. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కూడా కసిని ప్రదర్శిస్తూ ఆ గెలుపుపై సంకుచితంగా ఆలోచన చేశారు. నిజానికి అమితాబ్ బచ్చన్ ముంబై ఇండియన్స్‌ వీరాభిమాని. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తక్కువ స్కోరు చేయడంతో తన అభిమాన జట్టు ఓడిపోతుందని నిరాశగా టీవీ కట్టేశారంట. ఆ తర్వాత తన కుమారుడు ఫోన్‌ చేసి ముంబై గెలించిందనేసరికి ఆశ్చర్యపోయారట.
 
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులు చేయడం అమితాబ్‌కు రుచించలేదు. అందుకే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తర్వాత కట్టేసిన టీవీవైపు మళ్లీ కన్నెత్తి చూడలేదంట. మ్యాచ్ అనంతరం అభిషేక్‌ బచ్చన్‌ సమాచారంతో సంతోషించిన ఆయన ట్విట్టర్‌లో ఆ అనుభూతిని డైలాగ్‌తో పంచుకున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మీరు మమ్మల్ని పదిసార్లు కొట్టారు. కానీ మేం ఒక్కసారే మిమ్మల్ని కొట్టాం.. అమితాబ్‌కి ఇంత పక్షపాతమా?