బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (09:17 IST)

సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా: జేడీ లక్ష్మీనారాయణ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకొనేందుకు టీడీపీ, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే సీబీఐ మాజీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ జనసేనలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. లక్ష్మీనారాయణను తమ పార్టీలో చేర్చుకొనేందుకు టీడీపీ, బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే సీబీఐ మాజీ జేడీ చూపు పవన్ పార్టీపై ఉన్నట్టు సమాచారం. 
 
నిజాయితీ గల అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న లక్ష్మీనారాయణ వంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. కొంత కాలంగా వీళ్లిద్దరూ టచ్‌లో ఉన్నారని ఒకటి రెండుసార్లు లక్ష్మీనారాయణ పవన్‌ను కలిసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే రాజకీయ ప్రవేశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జేడీ అంటున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఐపీఎస్ మాజీ అధికారి లక్ష్మీనారాయణ మూడు రోజుల పర్యటన శనివారంతో ముగియనుంది. 
 
తన పర్యటనలో భాగంగా సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు జేడీ ప్రకటించారు. సామాజిక వర్గం కాదు సమాజమే ముఖ్యమని, విమర్శలు చేస్తున్నవారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. కాగా, ప్రజా సమస్యలపై అధ్యయనం నిమిత్తం ఈ నెల 3న లక్ష్మీనారాయణ తన పర్యటన ప్రారంభించారు. కిడ్నీ బాధితులు, రైతులు, చేనేత కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేస్తానని చెప్పారు