సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (10:29 IST)

ఏడవ తరగతి అమ్మాయిని చూసి 30ఏళ్ల వ్యక్తికి మూడ్ వస్తే?: శ్రీరెడ్డి

సంచలనాలకు మారుపేరు శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలతో దారితప్పింది. అప్పటి నుంచి న్యాయపోరాటానికి సిద్ధమైన శ్రీరెడ్డి

సంచలనాలకు మారుపేరు శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోరాటం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలతో దారితప్పింది. అప్పటి నుంచి న్యాయపోరాటానికి సిద్ధమైన శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా నిరసన పోరాటం చేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. చిన్నతనం నుంచే తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఆ పోస్టులో ప్రస్తావించింది. 
 
భయం రెండో వైపు..అంటూ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ.. ఏదో ఏ రోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో బతుకుతున్నానని తెలిపింది. తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు తనను అతను తాకాడు. పదో తరగతి వరకూ అదే జరిగింది. అప్పుడు తెలియలేదు. ప్రస్తుతం తెలిసినా ఏం చేయాలో తెలియదు. 
 
ఏడవ తరగతి అమ్మాయిని చూసి 30 ఏళ్ల వాడికి మూడ్ వస్తే దాన్ని ఏమనాలి? తాను పుట్టినప్పుడు తనను ఎత్తుకున్న చేతులే తనను ఆకాంక్షిస్తే.. ఏం చేయాలి.. ఎలా పోరాడాలంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇలా లక్షల కోట్ల మంది ఉన్నారు. బస్సుల్లో, సినిమా థియేటర్‌లో, జాతరలో అన్నీ ప్రాంతాల్లో ఇదే జరుగుతోంది. అయినా ఏమీ పీకలేని పిరికివాళ్లమని శ్రీరెడ్డి తెలిపింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టు చూసిన వాళ్లలో కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలు తొలిసారిగా తమను కదిలించాయంటూ పోస్టు చేస్తున్నారు.