మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srini
Last Modified: బుధవారం, 2 మే 2018 (11:26 IST)

ఇక... శ్రీ రెడ్డి లీగల్ ఫైట్, తనపై అత్యాచారం చేసినవారిపై నిర్భయ కేసులు... ఎవరో?

తనకు అన్యాయం జరిగిందంటూ మీడియాలో వాపోయిన శ్రీరెడ్డి ఇక కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయనుంది. ఇందుకు హైదరాబాదులో పేరొందిన అడ్వకేట్ కళానిధిని కలిసి తన తరపున న్యాయ పోరాటం చేయాలని కోరింది. అవకాశాలు ఇస్తాం అనిచెప్పి తనపై అత్యాచారం చేసిన వారిపై నిర్భయ కేస

తనకు అన్యాయం జరిగిందంటూ మీడియాలో వాపోయిన శ్రీరెడ్డి ఇక కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయనుంది. ఇందుకు హైదరాబాదులో పేరొందిన అడ్వకేట్ కళానిధిని కలిసి తన తరపున న్యాయ పోరాటం చేయాలని కోరింది. 
 
అవకాశాలు ఇస్తాం అనిచెప్పి తనపై అత్యాచారం చేసిన వారిపై నిర్భయ కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో పాటు, సామాజిక వెబ్సైట్లలో తనపై మానసిక దాడి చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపాలని కోరింది. సెలబ్రిటీ కేసులు, వివాదాస్పద అంశాలను చాలెంజ్‌గా తీసుకుని వాదిస్తారని కళానిధికి మంచి పేరుండటంతో శ్రీరెడ్డి కళానిధికి కేసు అప్పగించినట్టు తెలిసింది.