గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (14:36 IST)

సినీ కెరీర్ కోసం అమ్మాయిలు రాజీపడుతున్నారు.. నిర్మాతల తప్పులేదు : రాఖీ సావంత్

ఏ అంశంపైనా అయినా సరే బోల్డుగా మాట్లాడే బాలీవుడ్ నటీమణుల్లో రాఖీ సావంత్ ఒకరు. ఆమె ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా స్పందించింది.

ఏ అంశంపైనా అయినా సరే బోల్డుగా మాట్లాడే బాలీవుడ్ నటీమణుల్లో రాఖీ సావంత్ ఒకరు. ఆమె ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా స్పందించింది.
 
ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా, అన్ని చిత్ర పరిశ్రమల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా, తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తల్లో కూడా ఈ లైంగికదోపిడీపై తీవ్ర ఆందోళన చెందానని తెలిపారు. 
 
ఆ తర్వాత తన ప్రతిభతో వాటిని అధిగమించానని చెప్పింది. అయితే సినీ పరిశ్రమలో ఎవరిపై అత్యాచారాలు చేయరని, పరస్పర ఆమోదంతోనే ఇది జరుగుతుందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా, అవకాశాల కోసం యువతులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని... కాస్టింగ్ కౌచ్‌కు ప్రొడ్యూసర్లను తప్పుపట్టడం సరికాదని తెలిపింది. 
 
ప్రధానంగా హీరోయిన్లు కావాలన్న ఆశతో ఫిల్మ్ నగరిలో అడుగుపెట్టే అమ్మాయిలు కెరియర్ కోసం రాజీ పడుతున్నారని తెలిపింది. హీరోయిన్స్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు మరేదో అవుతున్నారని రాఖీసావంత్ వాపోయింది. 
 
తమ లక్ష్య సాధనంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఒత్తిళ్లు వచ్చినా అవకాశాల కోసం రాజీపడకూడదని... ప్రతిభతో సమస్యలను అధిగమించాలని సూచించింది. సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రాలు ప్రతిభతోనే రాణించారని ఆమె గుర్తు చేసింది.